స్ఫూర్తి

(ఈ కవిత సినీ రచయిత చంద్రబోసు గారు 2013 అట్లాంటా దర్శించిన సందర్భంగా వ్రాసినది)

 

మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి సహాయం, వ్యక్త పరిచే ప్రతి ఆలోచన వెనుక ఒక స్ఫూర్తి ఉండి తీరుతుంది. 

 

దానికి మనం 'ఒక తెలియని శక్తి అని', 'దైవమని', 'సృజనాత్మకత' అని ఏదేదో పేర్లు పెట్టేసుకుంటాం. 

 

నా స్వవిషయం గురించి అడిగారూ? అదే, నా స్ఫూర్తి గురించేగా? పూర్తిగా చెబుతా!

 

ప్రేమకు మా అమ్మ నా స్ఫూర్తి

ఆత్మీయతకు మా నాన్న నా స్ఫూర్తి

మనుగడకు నా భార్య నా స్ఫూర్తి

పట్టుదలకు నా పిల్లలు నా స్ఫూర్తి

 

స్వేచ్ఛకు పెరట్లో వాలే పక్షులు నా స్ఫూర్తి

మనోవికాసానికి పెరుగుతున్న మొక్కలు నా స్ఫూర్తి

ఆశలకు విచ్చుకోబోతున్న పూల మొగ్గలు నా స్ఫూర్తి 

రాబోయే రేపటికి కాసే కాయలే నా స్ఫూర్తి

 

సృజనాత్మకతకు నా మొదటి ఉద్యోగం నా స్ఫూర్తి

అమెరికా రావడానికి 'అమెరికానే' నా స్ఫూర్తి

ఇక్కడా రాణించడానికి వీళ్ళ సహ్రుదయమే నా స్ఫూర్తి

ఇక్కడే స్థిరపడాలని అనుకోవడాని ఆత్మీయులు నా స్ఫూర్తి

 

నా మెదడు పదునుకు ఈ రచనలు నా స్ఫూర్తి

ఆ రచనలకు కొన్ని సంఘటనలు నా స్ఫూర్తి

ఆ రచనలకు వచ్చిన స్పందన ఇంకొన్ని ప్రయోగాలకు నా స్ఫూర్తి

ఈ చిన్న సహాసానికి NATA సాహిత్య వేదిక నా స్ఫూర్తి

 

మీ సంగతి తెలియదు కాని కలిగింది ఎంతో త్రుప్తి,

మల్లి కలుద్దాం, ఇక స్వస్తి!

No comments:

Post a Comment

HINDI SHAYARI

Please excuse the typos. I am not very good at typing in Hindi. I did my best. 1 एक दो सान्स रोख कर रख्ने का अभ्यस कर लो य़दि प्यर मे डूब ...