తూర్పు - పడమర

ఈ కవిత సగటు మనుషుల గురించి, మిమ్మలి నవ్వించడాని/ఏడిపించడానికి ఓ సగటు మనిషి రాసిన కవిత. ప్రతి పదాన్ని గుచ్చి గుచ్చి పరిశీలించి బుర్ర పాడుచేసుకోకండి. వినండి/చదవండి. మరచిపొండి. అంతే!! 


:::::::ఇక్కడ = అమెరికా. అక్కడ = ఇండియా:::::


ఎక్కడ సెటిల్ అవ్వాలి? ఇండియానా, అమెరికానా?

తేల్చుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ!


రెండు మూడు పూటలు వంటలక్కడ

రెండు రోజులకొకసారి stove వెలిగితే పండగిక్కడ!


ఎదో విషాదమైతేనే నిశ్శబ్ధంగా ఉంటుందక్కడ

గుండు పిన్ను కింద పడితే panic తో బెదిరిపొతారిక్కడ!


ప్రతి వాడు డాక్టరో ఇంజనీరో అయితీరాల్సిందే అక్కడ

Career విషయం పిల్లలకు 100% ఫ్రీడమ్ ఇవ్వాల్సిందే ఇక్కడ


Fitness అని చెప్పి కొందరు తిని చావడంలేదు అక్కడ, ఇక్కడ

ఈ విషయంలో తేడా లేదేంటండి ఎక్కడా?


ఇండియానా, అమెరికానా?

తేల్చుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ!


Birthdayను ఆ రోజే సెలెబ్రేట్ చేసుకుంటారక్కడ

పెళ్లికైనా weekendకే  దొరుకుతుంది ముహూర్తమిక్కడ


కార్యక్రమాన్ని తగ్గట్టు చక్కని బట్టలేసుకుంటారక్కడ

మగవాళ్లకు చాలా eventsకు short టీషీర్ట్ డిఫాల్ట్ ఇక్కడ


మామూలు tea నుండి greenteaకి update అయ్యారక్కడ

కాఫీ తప్ప ఇంకో డ్రింకే తాగారిక్కడ


రోజులు మారాయి … Heart attack వొచ్చినా అంబులెన్సే నీగతి అక్కడ, ఇక్కడ

ఈ విషయంలో తేడా లేదేంటండి ఎక్కడా?

ఇండియానా, అమెరికానా?

తేల్చుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ!


పరిచయం లేకేపోయిన అన్నా, వదినా అని చక్కగా పలుకరిస్తారక్కడ

సొంత అత్తగారిని కూడా Ms. Olivia అని సంబోధిస్తారిక్కడ


ఇంకా పెద్దవాళ్ళకు గౌరవంఇచ్చి మాట్లాడుతున్నారక్కడ

పిల్లలతో కూడా మాట్లాడేముందు కొద్దీసేపు prepare అవ్వాలిక్కడ


నాలుగేళ్ళకొకసారి vacationకు వెళ్తే గొప్పక్కడ

నాలుగు నెలలకొకసారి బ్రేక్ కావాలి మనవాళ్ళకిక్కడ


షాపులో sale పెట్టారెంటే అవసరం లేకున్నా కొనేస్తున్నారు అక్కడ, ఇక్కడ

ఈ విషయంలో తేడా లేదేంటండి ఎక్కడా?


ఇండియానా, అమెరికానా?

తేల్చుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ!


మర్యాదగా, పద్దతిగా ఉంటె పిచ్చోడనుకుంటారక్కడ

కొద్దిగా అటు ఇటూ కనిపించినా దూరం జరుగుతారిక్కడ


నవ్వినా, హలో అన్నా ‘నేన్నీకు తెలుసా’ అంటారక్కడ

ఎదుటివాన్ని ‘హాయ్’ అనపోతే ‘uncivilized’ అంటారిక్కడ


18 ఏళ్ళు కుర్రాడు తాగకపోతే ఎగతాళి చేస్తారక్కడ

21 ఏళ్ళు దాటకముందు తాగితే బొక్కలో తోస్తారిక్కడ


Love, break-up. Same-to-same అక్కడ ఇక్కడ

ఈ విషయంలో తేడా లేదేంటండి ఎక్కడా?

…………………………………………………………………………………………...

ఈ కవితను ఎంత పొడుగైన రాయొచ్చు ఇక్కడ.

వినడానికి ఓపిక వుండాలిగా అక్కడ? :)


29 ఆగష్టు 2021





HINDI SHAYARI

Please excuse the typos. I am not very good at typing in Hindi. I did my best. 1 एक दो सान्स रोख कर रख्ने का अभ्यस कर लो य़दि प्यर मे डूब ...