ప్రకృతి - వికృతి

విజు చిలువేరు

27 జూన్ 2020


ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం 

ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం?


వృక్షాల్ని నరికి అందమైన ఇల్లు కట్టాం

పక్షుల గూళ్ళు కొల్ల గొట్టి వాటిని వెళ్ళగొట్టాం 


జంతు చర్మంతో కోటు కుట్టి వేసుకున్నాం

కొన్ని ప్రాణులను సృష్టి నుండే తరిమేసాం


ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం 

ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం?


సముద్రాన్ని క్షోభపెట్టి చమురెంతో తీస్తాం 

సునామీలాంటి సంక్షోభాలను కొని తెచ్చుకుంటాం  


భూమిని గజాల కొద్దీ పొడిచి నీళ్లు తోడుతాం

తరచూ భూకంప ప్రళయాలకు బలి అవుతాం 


ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం 

ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం?


కాలుష్యంతో వాతావరణానికే మసి పూసామ్ 

విషవాయువులతో ప్రాణాలనే తీసుకున్నాం 


వికృతమైన చేష్టలతో ప్రకృతితో ఆడుకున్నాం 

దాని తాండవంతో నానా పాట్లు పడుతున్నాం 


ఎప్పుడూ మనం ప్రకృతి నే దోచుకుంటాం 

ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం?


ప్రకృతి - వికృతి

విజు చిలువేరు 27 జూన్ 2020 ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం  ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం? వృక్షాల్ని నరికి అందమైన ఇల్లు కట్టాం పక్...