LoL (లాఫ్ అవుట్ లౌడ్)

కుడిచేతితో ఆపరేట్ చేస్తాడు వాట్సాప్పు

ఎడమచేతిలో చూస్తే ఓ కాఫీ కప్పు

వాన్నీ పలకరించండమే ఓ పెద్ద తప్పు

ఈ టెక్నాలజీతో వచ్చిందండి మనకు పెద్ద ముప్పు!

 

24 ఘంటలు వాడి నేస్తం ఫేసుబుక్కు

4-5 సార్లు పిలిచాక ఇస్తాడొక వింత లుక్కు

రోడ్డుమీద ఎటు వెళ్తున్నాడో తెలియదు వాడికి దిక్కు

ఈ టెక్నాలజీతో తెచ్చిపెట్టిందండి మనకో పెద్ద చిక్కు!

 

అవసరమా వెళ్లిన ప్రతి చోట ఓ సెల్ఫీ ఫోటో

ప్రతి celebrity తో ఆ వెదవ పోజు ఎందుకటో

అది ఫేసుబుక్కులో పెట్టెయ్యడమో వాడి మోటో

ఈ టెక్నాలజీ మన జీవితాల్ని ఎం చేయనుందేంటో

 

రెండేళ్ల పిల్లడు ఆపరేట్ చేస్తున్నాడు ఐపాడు (iPad)

తల్లి అన్నం తినిపిస్తున్నప్పుడు అదొక్కటే వాడికి తోడు

ఆవిడేంచేస్తుంది పాపం పడలేదు వాడి గోడు

ఈ టెక్నాలజీతో మారిపోయాడండి ప్రతివాడు!

 

ఈ మధ్య చేసి చూసారా ఎవరికైనా ఓ casual  కాల్

చేస్తే గనక అవుతుంది దాని గతి వాయిస్ మెయిల్

మానేసాం మనం చెక్ చేయడం పర్సనల్ email

కొత్త టెక్నాలజీ రాగానే పాతవవుతున్నవి ‘ఫార్ సేల్’!

 

వస్తూనే వున్నాయి 2G, 3G, 4G…5G

మన వాడకానికి ప్రతి వెర్షన్ అవుతుంది ‘మాజి’

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివాడు ఒకటే బిజీ

ఈ టెక్నాలజీ చేస్తోంది ప్రతొక్కణ్ణి క్రేజీ!

 

9 జూన్ 2017


No comments:

Post a Comment

HINDI SHAYARI

Please excuse the typos. I am not very good at typing in Hindi. I did my best. 1 एक दो सान्स रोख कर रख्ने का अभ्यस कर लो य़दि प्यर मे डूब ...