నేములో ఏముంది

చాలామంది జీవితాలలో ఏదో ఒక విషాద గాధ వుంటుంది. గతంలోనైతే హింస పెట్టే అత్తమామలు. ఈ రోజుల్లో అయితే 'నరకం చూపిస్తా' అనే కొడళ్ళు ఉన్నారు. ఇలాంటి అత్తలు కోడళ్ళు గురించి మీరు వినకపోతే, ఖచ్చితంగా మీరు తెలుగు సీరియల్లు చూడరు. లేదా మీరు పెళ్లి అయ్యాక మీ అత్తమామలదగ్గర 24 ఘంటలకన్నఎక్కువ ఉండలేదేమో. అయినా, మీ పర్సనల్ విషయాలు నాకెందుకుగాని, నా జీవితంలో దేవుడి దయ వల్ల అలాంటి చెదు నిజాలేమి లేవనే చెప్పుకోవొచ్చు. కానీ, చిన్నప్పడినుండి పగ వాడికి కూడా రాకూదనే ఒక సమస్య నన్ను చాల ఏళ్లుగా వేధించింది. సంతోషం పంచుకుంటే పదింతలవుతుందని , బాధను పంచుకుంటే అది సగమైన తగ్గుతుందని పెద్దలు అంటుంటారు. ఎందుకో మీకు చెబుతే పూర్తిగా తగ్గిపోతుందని అనిపిస్తోంది. వినండి మరి...

 

జన్మనామలు ఎవరు కనిపెట్టారో కాని, చాల వింతగాను, ఇబ్బంది పెట్టేవిధంగాను వుంటాయి. మీ జన్మనామం మీకు తెలుసో లేదో గాని, నాది మటుకు నేనే కాదు ఎవరూ మరచిపోనంత విచిత్రంగా ఉంటుంది - 'పీతాంబరం'. ఏవండీ, మగపిల్లవాన్ని కదా, స్వేతాంబరం అనో లేదా కేదాంబరమనో పెట్టొచ్చుగ - అహా... ఆచారం అడ్డోస్తుందని అదే ఖాయం చెసారు. ఒక విధంగా ఆలోచిస్తే అది సాక్షాత్తు దేవుళ్ళు ధరించే వస్త్రం. కానిమనకు తెలిసి ఆడవాళ్ళు కట్టుకునే పట్టుచీరని కూడా పీతాంబరం అనే అంటారు. అక్కదొచ్చిందండి సమస్య.

ఇహ నా అసలు పేరు విషయానికొస్తే, తాతలకు, నాన్నమ్మలకు వాళ్ళ పిల్లలమీదకన్నా వాళ్ళ మనుమలు మనుమరండ్ల మీద ఎక్కువ ఉంటుందనే విషయాన్నీ, పిల్లలు పుట్టకముందే వాళ్ళ పేర్లు నిర్ణయించి వాళ్ళ అధికారానికి (నిజం చెప్పాలంటే వాళ్ళ నియంత్రుత్వానికి) శ్రీకారం చుడతారు. నా విషయంలో అదే జరిగింది. నా పేరు పెట్టినప్పుడు మా అమ్మ, నాన్న సీన్లో లేరనేది అర్ధమవుతుంది. మా తాతగారు నాపేరేమో 'శ్రీ విరించి' అని మా అన్నయ్య పేరేమో శ్రీమాన్ మరి మా తమ్ముడికేమో శ్రీధర్ [not-so-embarrassing] పేర్లు పెట్టి ఎంతో పుణ్యం కట్టుకున్నరనే చెప్పొచ్చు.

 

ఇప్పటివారకు ఏ conflict లేకుండా అంతా సవ్యంగానే ఉందిగా, ఈ సోది మనకెందుకు చెబుతున్నాడు అని అనుకొంటున్నారా? వస్తున్నా, వస్తున్నా. అక్కడికే వస్తున్నా!

 

నాకు నాలుగేల్లున్నప్పుడు శ్రీ విరించి అంటే శ్రీ మహా విష్నువు అని మా నాన్నమ్మ చెప్పేది. అంత చిన్న పిల్లవాడికి శ్రీ విష్నువు గురించి, విరించి గురించి ఎందుకండీ పెద్దవాళ్ళ పిచ్చి కాకాపోతే. అర్థంకాకున్నా అర్ధమైనట్లుగా బుద్ధిగా తలూపడం అ ageలో మనకొచ్చిన ఒకే Time-Saving Trick. ఈ కథలో అది trick చాలా సార్లు వాడతాను. మీరే చూద్దురుగాని. నాకు ఎడేల్లోచ్చాయి. Place: స్కూలు. Scene: క్లాసురూం. టీచర్ attendance తీసుకున్నాడేకానీ నా పేరు పిలవలేదు. లేచి నించొని 'సర్' అనేలోగానే "ఈరోజునుండి నీపేరు విజు కాకతీయ అయింది . నేను కాదు మీ నాన్నగారు మార్చరు. ఇదో ఇప్పుడే మెసేజ్ ఒచ్చిందాని" ఓ పేపర్ చూపించారు. lunch breakలో అదే schoolలో చదువుతున్న మా అన్నయ్య దగ్గరకెళ్ళి ఈ విషయం చేబుతామనేసరికి అచ్చం అలాంటి వార్తే అతనూ చెప్పాడు. "నాన్న నాపేరు మార్చాడ"ని. దాంతో ఇంటికెళ్ళి తాతగారు పెట్టినపేరు మార్చే అధికారం తండ్రికి ఎవరిచ్చారా అనే అంశంపై మా అమ్మ, అన్నయ్య రీసెర్చ్ మొదలుపెట్టారు . కొన్నాళ్ళు అలా వాళ్ళు పేరు మార్పిడి మీద కుస్తీ పట్టి అలసిపోయర్లెండి. కాని మా అన్నయమటుకు ఇప్పడికి వారానికొకసారైన కడుపునిండా argue చేస్తూనేవున్నాడు.

 

మీకు అనుమానం రాకముందే ఒక విషయం చెప్పాలి. మనుషులకు stamp collection, coin collection లాంటి హాబీస్ ఉంటాయిగాని, అదేంటో మా నాన్నకు name collection ఓ హాబీ. రకరకాల పుస్తకాలు చదివినప్పుడల్లా దాంట్లోని కొన్ని unique పేర్లు collect చేసేవాడు. ఆ ప్రీమియం collectionలోనుండి పెట్టినవే మా పేర్లు. ఎవరి పిచ్చి వాళ్ళ ఆనందమని సర్డుకుపోఎసరికి హై స్చూలుకు వచ్చేసాను. స్కూల్ మారడంతో classmates ను పరిచయం చేసుకుంటూ నా పేరు పళానా అని చెప్పగానే విజు మీ నిక్ నేమా, అసలు పేరు 'విజయ్' నా. అవునూ, ఈ కాకతీయ ఏంటి? సామరాజ్యం పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు లాంటి ప్రశ్నలు రకరకాలుగా అడగడం. నేనూ అ టైములో తోచిన సమాధానం చెప్పడం అలవాటైపోయింది.

 

నేను intermediateకొచ్చేసరికి నా ఖర్మకాలి కాకతీయ యూనివర్సిటీ start అయింది. నా సమస్య డబులయింది. ఇహ డిగ్రీ కాలేజీలోకొచ్చాకా నాపేరు చెప్పడం పూర్తిగాకముందే 'ఓ మీరు కాకతీయ యునివర్సిటిలో చదువుతున్నారా' అని అనేవాళ్ళు. నా పేరు కథ చెబుతే మళ్ళీ ఓ అరఘంట సుత్తి ఎందుకులే అని "అవును" అని అబద్ధం చెప్పేవాన్ని. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నానన్నది campusలో ఉన్నప్పుడే నిజం. బయట అది అబద్ధం.

 

ఇలా నా పేరు సమస్య ఎన్నో మలుపులు తిరిగింది. నేను OU కాంపస్ లో masters చేస్తున్నప్పుడు నా పేరు వినగానే నాతో football ఆడుకొందాం అనుకొన్నాడు ఒకడు. వాడికి 'కోడి మెదడు' అని నిక్ నేం కూడా ఉంది. ఏళ్లుగా వింత వింత సమస్యలతో విసిగిఉన్న నాకు ఓ మెరుపులాంటి ఆలోచన తట్టింది. మాది వరంగాలూ, మాది కాకతీయ సామరాజ్యంలో ఆఖరు కుటుంబం కావడంతో మా నాన్న గారు ఆ పేరు ఖాయం చేసారు అని చెబితే మీరు నమ్మరుగాని వాడి నమ్మాడండి. కొన్నాళ్ళు నన్ను అలాగే పరిచయం చేసాడు కూడా!

 

అలాగా వాడు నమ్మాకే కాకతీయ సామరాజ్యం మీద రీసర్చ్ మొదలు పెట్టాను. అదే curiosityతో హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, గతంలో ఎన్నోసార్లు చూసినా ఈసారి వెళ్ళి దాని చరిత్ర మొత్తం తెలుసుకొని ఓ 5 నిముషాలు tranceలోకి వెళ్లి అదేదో మా తాత ముత్తాతలు కట్టిచించిన గుడిలా ఫీలయ్యాను కూడా!

 

పేరుతొ బాగా విసిగిపోయీ రకరకాల వివరణలు ఇచ్చి పండిపోయి, కొత్త job లో చేరినప్పుడు, ఏదైనా పార్టిల్లో కొత్తవాళ్ళను పరిచయం చేసుకున్నప్పుడు విసుగులేకుండా కొత్త ప్రయత్నాలతో టైం పాస్ చేసేవాన్ని.

 

ఎవడైనా విసా వస్తే కాలరు ఎగరేసి నేనూ అమెరికాకు వెళ్తున్నాని ప్రతివాడికి చెప్పి సంతోషపడతాడు కదండీ. కాని నేను ఇండియా శాకులకు కోలుకోన్ననేగాని US లో ఏ భయకరమైన సంఘటనలు ఎదురుకోవస్తుందేమో అని టెన్షన్ మటుకు ఉండిందండి. ఇంతలో ఫ్లైట్లో కూచున్నప్పుడు ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఫ్లైట్ దిగ్గానే 'కాకతీయ' ను కట్ చేసా. కొన్నేళ్ళు First అండ్ Last Nameతో ఏదో దొంగలా చెలామణి అవుతున్ననే అనే బాధ పడాలో, పోన్లే ప్రతి వాడికి ఇక్కడకూడా పేరుతొ పోరు తప్పింది అనే సంతోషపడాలో తికమక పడుతూనే వున్నను. ఇంతలో తెలుగు సినిమా మిడిల్ క్లాసు ఫ్యామిలి లాగే ఇంకో కొత్త సమస్య. నా first name విజు ఖూని చేసి వైజు అనో వైగు అనో పిలవడం మొదలుపెట్టారు అమెరికన్లు.

 

ఇక నావాళ్ళ కాదండి. నేనే కాదు మీరు విసిగిపోయినట్టున్నారు. ఇద్దరం ఒక understandingukochi ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. ఫస్ట్ నేములో ఫస్ట్ లెటర్ V ఉంటే చాలండి. ఎవ్వరు ఏ పేరు పెట్టి పిలిచినా పలికుతానండి. ఉంటానండి !


No comments:

Post a Comment

HINDI SHAYARI

Please excuse the typos. I am not very good at typing in Hindi. I did my best. 1 एक दो सान्स रोख कर रख्ने का अभ्यस कर लो य़दि प्यर मे डूब ...