అర్జెంట్ గా నా పేరు మార్చండి, ప్లీజ్!

తివాచి… ఎం పేరండది? ఎవడండి బాబు నా పేరు చివర ‘ఛీ’ పెట్టారు. పర్లేదులెండి మంచి పేరు లేదనే బాధ ఒకటే తప్ప, ఇంట్లో ప్రతి హాల్లో నన్ను చక్కగా అలంకరించి ఇంటికొచ్చిన ప్రతి వానికి నా గురించి కనీసం 10 నిమషాల మీరు సుత్తి వేస్తారు చూడండి అది నాకు బాగా నచ్చుతుంది. మా ఇంటికి ఎవరైనా మొదటిసారి వస్తే నా ప్రస్తావనే ఎక్కువ. ఇంటినిండా మేవే ఉంటాం కదండీ. అమెరికాలోనైతే ఇంట్లో ఇద్దరున్న మేం నలుగురముంటాం. ఇంటికి మొదటిసారి guests వచ్చినవాళ్లకు టూర్ ఇస్తున్నప్పుడు నేను రహస్యంగా విని గుర్తుపెట్టుకొన్నకామెంట్స్ లో నుండి కొన్ని మీతో పంచుకుంటున్నాను. ఇవన్ని చాల సున్నితంగా వుంటాయి, అందుకే సుమా మీరూ జాగ్రత్తగా విని మనసులోనే దాచుకోండి.


“ఈ rug కొంచం డిఫరెంట్ లెండి. అంత డబ్బు పెట్టి కొనడం అవసరమా అంటే వింటారా మా అయన. Pure Wool. Saleలో కొన్న మహా అయితే 20% తక్కువకొచ్చింది … (దాదాపు $400 డిస్కౌంట్ అనుకొంటా). దీనికో special కార్పెట్ క్లీనర్ $289 పెట్టి కొనల్సోచింది కూడా”. అసలు ధర చెప్పకుండా, discount % చెప్పి ఎంత చక్కగా manage చేసిందండి! ఐ లవ్ మై మేడం.

ఆర్డర్ ఇచ్చాక నాలుగున్నర నెల్లకు shipment వచ్చింది, అది వేరే విషయమనుకోండి. “ఈ రగ్గుని కొన్నాక దీన్ని ఫామిలీ రూములో వేయాలా, ఫార్మల్ డైనింగ్ రూములో వేయాలా అని తేల్చడానికి మాకు 8 నెలలు పట్టింది. మేము తేల్చుకోలేక మా interior designerను సంప్రదించి ఫైనల్ గా ఇదో ఇక్కడ LOFT లో వేసాం. ఇక్కడ బాగుందంటారా?” (Wife అండ్ Husband 8 నెలలు అలోచించి అక్కడ వేసాక, వాళ్ళ పిచ్చి కానీ మార్చండి అని ఎవరు మాత్రం చెపుతారు).

ఓ సారి మా వాళ్ళ బంధువులు వెకేషన్ కొచ్హారు. వాల్లకొక మూడేళ్ళ పాప. ఇక పాప తల్లి బాధలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయొచ్చు. “అదేంటి పాపను ఆ costly రగ్గుమీద అలాగ డైరెక్టుగా కూచోబెట్టావ్. OMG! ఏదైనా బెడ్ షీట్ వేయమ్మా. చూడు చూడు already ఓ మరక పడింది కూడా… (పడ్డ మరక ఆవగింజంత. మా అమ్మగారి అరుపులు అర ఘంట). అసలామరక వెతకడానికి కాంటెస్ట్ పెట్టిన ఆవిడే winner, ఎందుకంటే ఆవిడకు తప్ప ఎవ్వరికి కనిపించదు గనక). ఆ మరకకు చెరపడానికి మూడు రోజులు పట్టింది. అంటే Guests వచ్చిన వాళ్ళ వెకేషన్ మరకతోనే గడిచింది అని కూడా మనం చెప్పుకోవొచ్చు!! మరక మంచిదే అని ఓ డిటర్జెంట్ కమర్షియల్ లో వాడారు. ఆ slogan నేనే వాళకమ్మను.

“మీరు సోఫాలో కూచొని కాఫీ తాగొద్దని లక్ష సార్లు చెప్పానా? పొరపాటున చేయి జారితే తివాచి పాడవుతుంది” అది నా ప్రాణం అండి. మా మాస్టారుతో పాటు ఇది రోజుకు రెండు సార్లు నేను వినే సుప్రభాతం, సంధ్యావందనం. (వేడి వేడి కాఫీ నా మీద పడితే నా ప్రాణం సంగతి ఇద్దరికీ గుర్తురాదు).

ఒక రోజు ఆ ఘడియ రానే వచ్చింది. నా మీద కాఫీ పడింది (కాదు కసి కొద్దిగా పోయబడింది). chemicals వాడి బుకెట్ల కొద్ది నీళ్ళతో నాకు స్నానాలు చేయించినా ఆ మకర పోలేదు. మా మేడం గుండె పగిలింది. నన్నోదులుకోలేక basement లోకి మార్చారు. ఇహ నాకు నా గురించి పొగడ్తలు గాని, గెస్టులకు warningలు గాని వినిపించవు. మీరే చెప్పండి. నేను బాధపడాలా, సంతోషించాలా? రెండు చేయకుండా చక్కగా రవి శంకర్ గారి Art of Living ఫిలాసఫీ ఫాలో కమ్మంటారా?

ఇది కథ అయితే ముగించొచ్చు. ఇదొక పెద్ద saga. ఎంతైనా సాగాతీయొచ్చు.

No comments:

Post a Comment

HINDI SHAYARI

Please excuse the typos. I am not very good at typing in Hindi. I did my best. 1 एक दो सान्स रोख कर रख्ने का अभ्यस कर लो य़दि प्यर मे डूब ...