మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా

ఓ మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

ఓ మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా -2

చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

జీడికల్లు గుడి కాడా లేడి కళ్ళు చూపిస్తా

రాములవారి పాదాలను దగ్గరుండి మొక్కిపిస్తా

డైరెక్టుగా సీతమ్మదర్శనమే జేపిస్తా

డైరెక్టుగా సీతంమనూ... దర్శనమే జేపిస్తా.

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

పెంబర్తి కాడ నీకు బ్రాసు నెమలిని కొనిపెడత

బానపురం గుల్లే నీకు హనుమంతుని చూపిస్తా

జనగాము టేసంలా చాయి తాగిపిస్తా

జనగాము టేసంలా..... మసాల చయనే తాగిపిస్తా

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

కాజీపేట కాడ నీకు సక్కని గాజులే తొడిపిస్తా

నక్కలగుట్ట తాన నీకు చెక్క బొమ్మలే  కొనిపెడతా

యునివర్సిటీ క్యాంపసంత తిప్పి నీకు చూపెడత

కాకతీయ క్యంపసంతా... తిప్పి నీకు సూపెడ్త

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! -2

 

హనుకొండ చౌరస్తాల మిర్చి బజ్జి తినపెడ్త

అలంకారు టాకీసుల ఇంగ్లీషు సీన్మనే చూపిస్తా

వేయి తంబల గుడినంత దగ్గరుండి చూపెడత

వేయి తంబల గుడినంతా... దగ్గరుండి చూపెడత

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

అశోకు హోటల్లో మటను బిర్యాని తినిపిస్తా

గాలక్సీ స్టుడియోలో కలరు ఫోటోలే దిగిపిస్తా

కాలేజుల పోరగాండ్ల కథలన్నీ చూపెడత

కాలేజుల పోరాగండ్లా... కథలన్నీ  చూపెడత

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

వరంగల్లు టేసను కాడా జార్జేట్ చీరలు కొనిపెడత

బాటా షోరూముల మెరుపు చెప్పులే కొనిపెడత

టాటా షోరూముల లేటెస్టు ఫోనునే ఇప్పిస్త

టాటా షోరూములా... లేటెస్టు ఫోనునే ఇప్పిస్త

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా -౨

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

రామప్ప గుడికు నిన్ను AC కార్ల తోల్కపోత

బద్రకాలి గుల్లే శాకంబరి చూపెడతా

ఓరుగల్లు ఫోర్టుకాడ కాకతీయ గేటునే చూపిస్తా

ఓరుగల్లు ఫోర్టుకాడ... కాకతీయ గేటునే చూపిస్తా

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

అడుగుతే నీకోసం చందమామ తెచ్చిపెడతా 

కోరితే నీకోసం కొండలైనా కదిలిపిస్త 

వరంగల్లు మనిషిని నేను మాటమీద నిలబడత 

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - ౨

 

సక్కంగుందిరో ఓ బావ నీ జిల్లా - 2

సూపెడితివిరో మరి  ఊళ్లు తిప్పి నీ జిల్లా - 2

 

యునివర్సిటీకి ఫోర్టుకు ఫెమజుగాదు నా జిల్లా

బోలెడంత ప్రేమగల్లది నా తల్లిగారి జిల్లా

మర్యాదకు మారుపేరు నల్లగొండ నా జిల్లా 

మర్యాదకు మారుపెరూ... నల్లగొండ నా జిల్లా

ప్రకృతి - వికృతి

విజు చిలువేరు 27 జూన్ 2020 ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం  ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం? వృక్షాల్ని నరికి అందమైన ఇల్లు కట్టాం పక్...