మారిపోయింది లోకమంతా

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా 

 

​మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ముసలాయనా

 

పంచగట్టి, బుస్కొటేసి బొరుగోట్టిందే 

షార్టులు టీ షర్టులు నేను కొనుకుంటనే

 

చెడ్డి బనీనేసుకుని తిరుగుతనంటవా

సూసుకో అద్దంలా నిన్ను నువ్వు గుర్తుబడ్తవా?

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా  

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

తోలు చెప్పులేసుకుని బొరుగోట్టిందే

నైకి షూజులేసుకొని జాగింగ్జేస్తనే 

 

ఈ శూజులు పోజులు నీకెందుకయ్య 

నడవలేక ఉర్కలేక పడ్తవయ్యా 

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా  

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

ల్యాండ్ లైన్ల మాట్లాడ్తె బోరుగోడుతుందే 

సెల్లుఫొను కొనుక్కొని మాట్లాడ్తనే  

 

నువ్వు మాట్లాడే దంతగూడ ఉత్తి సోల్లు 

కట్ట లేక సస్త నేను నెల నెల నీ సెల్లు బిల్లు  

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

మనూల్లె  టాకీసుకుబోయ్యి బోరుగోడుతుందే 

పట్నంబొయ్యి IMAX ల సీన్మ సూద్దమే 

 

ఎక్కడ సూస్తె ఏందయ్యా ఆ చెత్త సీన్మాలు

పట్నం బోతే అయితయి బోలెడు పైసలు 

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

ఇంటర్నెట్ కేఫుకుబోయ్యి బోరుగోడుతుందే

మంచి Laptop ఒక్కటి మనం కొనుకున్దామే 

 

email సదవడానికి computer ఎందుకు

10 రూపాయిలకు ప్రింట్ ఔటోస్తది ఇంటిముందుకు 

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

అన్నం కూర తిని తిని బోరుగోడుతుందే

Pizza, burgerలు ఆర్డర్ చేద్దమే 

 

తినాడానికి బాగానేవుంటై ఆ pizzaలు 

కడుపుల గడబడ చేస్తాయి చాన రోజులు 

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

ఈ సైట్ అద్దాలు పెట్టుకొని బోరుగోడుతుందే

నల్లద్దాలు పెట్టుకుంటే హీరో లేక్కుంటనే 

 

హీరో ముచ్చటెందో గాని నాకు తెల్వదు

కుక్కలు ఎంటబడతై  ఫోజులు కొట్టొద్దు

 

లోకమంతా మారినా రాములమ్మో 

మనం అసలే మారోద్దే ఓ చిలకమ్మా 

 

వద్దొద్దు మనకీ కొత్త మోజులు 

నిన్ను నన్ను ముంచుతై పరదేశి పోజులు


ప్రకృతి - వికృతి

విజు చిలువేరు 27 జూన్ 2020 ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం  ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం? వృక్షాల్ని నరికి అందమైన ఇల్లు కట్టాం పక్...