English Ammamma - తెలుగు మనవడు

(Script of a skit presented at American Telugu Association (ATA) Convention - 2012 Atlanta, USA. Main Stage)

 

Script and Direction - Viju Chiluveru

Ammamma - Dr. Manoj Naidu

Grandson - Theja Chennubhotla

 

Empty Stage. Announcer voice from background: ఇప్పుడు మీరు చూడబోయేది ఒక అమ్మమ్మ ఆవిడా మనువడు తేజ మధ్య జరిగే సంభాషణ. అమ్మమ్మ అమెరికా వచ్చే ముందు ఇండియాలో ఆరు నెలలు కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుని వస్తుంది. అలాగే, ఇక్కడేమో తేజ వాళ్ళ పరెంట్స్ ఇండియా నుండి వచ్చిన వాళ్ళతో తేజ తెలుగులో మాట్లాడాలనే పంతంతో తెలుగు బడికి పంపించి ఏదో కొంత నేర్పించారు. 

 

అమ్మమ్మ తెలుగులోనేగా మాట్లాడుతుందని తేజ, అలాగే తేజ ఇంగ్లిష్లో మాట్లాడుతుందని అమ్మమ్మ భ్రమపడ్డారు. తేజ పరెంట్స్ పెద్ద surprise ఇద్దామని ఏంటో ఆశగా ఎదురుచూస్తున్నారు.  కథ అడ్డం తిరిగింది. ఇద్దరూ ఆరునెలలు పడ్డ కష్టానికి పలితం ఏమటో మీరే చూద్దురుగాని!

 

Ammamma: How are you తేజ?

తేజ : నేను బాగున్నాను అమ్మమ్మ. మీరు బాగున్నారా?

 

A: I am fine. Oh, I am so happy. You are speaking Telugu. That's gooood. 

T: అవును అమ్మమ్మ. నేను తెలుగు నేర్చుకుంటున్నాగా

 

A: Before coming here, I went to Spoken English school, you know. Now I can speak English well. You too speak in English no?

T: ఆమ్మో! అమ్మ చంపేస్తుంది. నేను మీతో తెలుగులోనే మాట్లాడాలి. అవునూ 'బ్రోకెన్ ఇంగ్లీష్ స్కూలుకు వెళ్ళాను' అన్నారు. 'బ్రోకెన్ ఇంగ్లీష్ స్కూలు' అంటే ఏవిటి?

 

A: Not 'broken English', 'spoken English', 'spoken English'. Oh my God! Anyway, Let's continue. What's up?

T: మాట్లాడుతున్నప్పుడు మధ్యలో 'what's up' అనరు అమ్మమ్మ.  మొదట్లోనే అనేయ్యాలి.

 

A: I know, I know. OK. Tell me your school name

T: నేను Medlock Bridge స్కూల్ కు వెళ్తాను

 

A. Do you have to cross over a bridge to go to your school?

T. కాదమమ్మా నా స్కూలు పారే అది

 

A. In India, school names are nice you know. Rosary Convent, Little Flower, Daffodils schools. We don't have names of bridges and roads... OK, Ok... what's your class teacher's name?

 

T. మా క్లాసు టీచర్ పేరు Tom Morrow

A. Why don't you tell me today? Why Tomorrow?

 

T. మా టీచర్ పేరే అది అమ్మమ్మ ! 'T o m   M o r r o w'

A. We don't have such names in India. Most names are God's names you know! My teacher's name was Sitaramanjaneyula Venkata Rajashekhara Sastri.

 

T. అబ్బో అంత పొడుగు పేరా?

A. You are speaking well in Telugu. I will give you some English Words. tell me in Telugu... 

 

 

T: Abbo anta podugu pera? Palakadam Kashtam...

T అబ్బో అంత పొడుగు పేరా?

 

A. You are speaking well in Telugu. I will give you some English Words. tell me in Telugu...  OK?

T: Prayatnistaanu

 

English to Telugu

 

A: Paper

T: Mirapakaya

పెప్పేర్ కాదు paper, paper

T: Oh... Kagitham

 

A: Mother

T: Maatha

 

A: Letter

T: Aksharam

 

Telugu to English

 

A: I will give you some Telugu words. Translate it into English

T: Thappakunda

 

A: బల్ల

T: Lizard

A: Not Balli. Balla, Balla

T: Oh... Table

 

A: పిల్లో

T: అమ్మాయి

A: I thought so. 'Pillow' doesn't mean girl. It is 'Dindu' or 'Talagada'

T: రెండు ఒకే లాగ ఉంటె అమ్మాయి అనుకున్న

 

A: పాట

T: Song

 

A: గుడ్

T: Manchi

A: What is that? I did give any word to you yet...

T: మీరు గుడ్ అన్నారు కదా

 

A: అబ్బో

T: W O W

 

A: ఆట 

T: American Telugu Association

 

A: Good Job !! I thought you were going to say 'play' or 'game'

T: ఎప్పుడో అయితే 'గేమ్' అనే వాణ్ని. ఇప్పుడు మనం ATA conventionలో ఉన్నంగా. అందుకే ఆలా చెప్పా.

 

అ: ఇక నా వాళ్ళ కాదురా. నేను తెలుగులోనే మాట్లాడుతాను...

T: Me Too. I can't do it anymore... I did it only to please Mom and Dad. I am done with it.

 

Both: Let's go and eat lunch. ఆకలి దంచేస్తోంది...


పుష్పము, శరణం, గచ్చామి

మీ పూజలు, మీ దేవుళ్ళకు కావాలి బోలెడు పూలు

మేములేందే జరగవు పెళ్ళిళ్ళు పేరంటాలు

 

ఆశ్వీజం వస్తే చాలు ఊరంతా కలకలలు

పెర్చేస్తారు మాతో రంగురంగుల బతుకమ్మలు

 

రాజకీయ నాయకులు, నడిరోడ్డున విగ్రహాలు, చిత్ర పటాలు

అన్నిటికి మరి మేమే అలంకారాలు

 

స్నానాలకు ఖర్చుచేస్తారు ఎన్నో బక్కెట్లు  

గిన్నెలకు, బట్టలకు వాడేస్తారు ఎన్నో గాలన్లు

 

భూమంతట కరువైపోయాయి వర్షాలు

గుర్తుపెట్టుకుని పోయండి మాకు కాసిన్ని నీళ్ళు

 

మనుషులకే వాస్తాయని అనుకోకండి కన్నీళ్ళు

దగ్గరకొచ్చి చూడండి పెట్టుకుని రెండు కళ్ళు…

 

(మా ‘బాస్’ ఆర్డర్ వేస్తె సాయంత్రం వాడిపోయిన మొక్కలకు నీళ్ళు పెట్టిన మరు క్షణం వచ్చి వ్రాసిన కవిత ఇది)

అర్జెంట్ గా నా పేరు మార్చండి, ప్లీజ్!

తివాచి… ఎం పేరండది? ఎవడండి బాబు నా పేరు చివర ‘ఛీ’ పెట్టారు. పర్లేదులెండి మంచి పేరు లేదనే బాధ ఒకటే తప్ప, ఇంట్లో ప్రతి హాల్లో నన్ను చక్కగా అలంకరించి ఇంటికొచ్చిన ప్రతి వానికి నా గురించి కనీసం 10 నిమషాల మీరు సుత్తి వేస్తారు చూడండి అది నాకు బాగా నచ్చుతుంది. మా ఇంటికి ఎవరైనా మొదటిసారి వస్తే నా ప్రస్తావనే ఎక్కువ. ఇంటినిండా మేవే ఉంటాం కదండీ. అమెరికాలోనైతే ఇంట్లో ఇద్దరున్న మేం నలుగురముంటాం. ఇంటికి మొదటిసారి guests వచ్చినవాళ్లకు టూర్ ఇస్తున్నప్పుడు నేను రహస్యంగా విని గుర్తుపెట్టుకొన్నకామెంట్స్ లో నుండి కొన్ని మీతో పంచుకుంటున్నాను. ఇవన్ని చాల సున్నితంగా వుంటాయి, అందుకే సుమా మీరూ జాగ్రత్తగా విని మనసులోనే దాచుకోండి.


“ఈ rug కొంచం డిఫరెంట్ లెండి. అంత డబ్బు పెట్టి కొనడం అవసరమా అంటే వింటారా మా అయన. Pure Wool. Saleలో కొన్న మహా అయితే 20% తక్కువకొచ్చింది … (దాదాపు $400 డిస్కౌంట్ అనుకొంటా). దీనికో special కార్పెట్ క్లీనర్ $289 పెట్టి కొనల్సోచింది కూడా”. అసలు ధర చెప్పకుండా, discount % చెప్పి ఎంత చక్కగా manage చేసిందండి! ఐ లవ్ మై మేడం.

ఆర్డర్ ఇచ్చాక నాలుగున్నర నెల్లకు shipment వచ్చింది, అది వేరే విషయమనుకోండి. “ఈ రగ్గుని కొన్నాక దీన్ని ఫామిలీ రూములో వేయాలా, ఫార్మల్ డైనింగ్ రూములో వేయాలా అని తేల్చడానికి మాకు 8 నెలలు పట్టింది. మేము తేల్చుకోలేక మా interior designerను సంప్రదించి ఫైనల్ గా ఇదో ఇక్కడ LOFT లో వేసాం. ఇక్కడ బాగుందంటారా?” (Wife అండ్ Husband 8 నెలలు అలోచించి అక్కడ వేసాక, వాళ్ళ పిచ్చి కానీ మార్చండి అని ఎవరు మాత్రం చెపుతారు).

ఓ సారి మా వాళ్ళ బంధువులు వెకేషన్ కొచ్హారు. వాల్లకొక మూడేళ్ళ పాప. ఇక పాప తల్లి బాధలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయొచ్చు. “అదేంటి పాపను ఆ costly రగ్గుమీద అలాగ డైరెక్టుగా కూచోబెట్టావ్. OMG! ఏదైనా బెడ్ షీట్ వేయమ్మా. చూడు చూడు already ఓ మరక పడింది కూడా… (పడ్డ మరక ఆవగింజంత. మా అమ్మగారి అరుపులు అర ఘంట). అసలామరక వెతకడానికి కాంటెస్ట్ పెట్టిన ఆవిడే winner, ఎందుకంటే ఆవిడకు తప్ప ఎవ్వరికి కనిపించదు గనక). ఆ మరకకు చెరపడానికి మూడు రోజులు పట్టింది. అంటే Guests వచ్చిన వాళ్ళ వెకేషన్ మరకతోనే గడిచింది అని కూడా మనం చెప్పుకోవొచ్చు!! మరక మంచిదే అని ఓ డిటర్జెంట్ కమర్షియల్ లో వాడారు. ఆ slogan నేనే వాళకమ్మను.

“మీరు సోఫాలో కూచొని కాఫీ తాగొద్దని లక్ష సార్లు చెప్పానా? పొరపాటున చేయి జారితే తివాచి పాడవుతుంది” అది నా ప్రాణం అండి. మా మాస్టారుతో పాటు ఇది రోజుకు రెండు సార్లు నేను వినే సుప్రభాతం, సంధ్యావందనం. (వేడి వేడి కాఫీ నా మీద పడితే నా ప్రాణం సంగతి ఇద్దరికీ గుర్తురాదు).

ఒక రోజు ఆ ఘడియ రానే వచ్చింది. నా మీద కాఫీ పడింది (కాదు కసి కొద్దిగా పోయబడింది). chemicals వాడి బుకెట్ల కొద్ది నీళ్ళతో నాకు స్నానాలు చేయించినా ఆ మకర పోలేదు. మా మేడం గుండె పగిలింది. నన్నోదులుకోలేక basement లోకి మార్చారు. ఇహ నాకు నా గురించి పొగడ్తలు గాని, గెస్టులకు warningలు గాని వినిపించవు. మీరే చెప్పండి. నేను బాధపడాలా, సంతోషించాలా? రెండు చేయకుండా చక్కగా రవి శంకర్ గారి Art of Living ఫిలాసఫీ ఫాలో కమ్మంటారా?

ఇది కథ అయితే ముగించొచ్చు. ఇదొక పెద్ద saga. ఎంతైనా సాగాతీయొచ్చు.

నేములో ఏముంది

చాలామంది జీవితాలలో ఏదో ఒక విషాద గాధ వుంటుంది. గతంలోనైతే హింస పెట్టే అత్తమామలు. ఈ రోజుల్లో అయితే 'నరకం చూపిస్తా' అనే కొడళ్ళు ఉన్నారు. ఇలాంటి అత్తలు కోడళ్ళు గురించి మీరు వినకపోతే, ఖచ్చితంగా మీరు తెలుగు సీరియల్లు చూడరు. లేదా మీరు పెళ్లి అయ్యాక మీ అత్తమామలదగ్గర 24 ఘంటలకన్నఎక్కువ ఉండలేదేమో. అయినా, మీ పర్సనల్ విషయాలు నాకెందుకుగాని, నా జీవితంలో దేవుడి దయ వల్ల అలాంటి చెదు నిజాలేమి లేవనే చెప్పుకోవొచ్చు. కానీ, చిన్నప్పడినుండి పగ వాడికి కూడా రాకూదనే ఒక సమస్య నన్ను చాల ఏళ్లుగా వేధించింది. సంతోషం పంచుకుంటే పదింతలవుతుందని , బాధను పంచుకుంటే అది సగమైన తగ్గుతుందని పెద్దలు అంటుంటారు. ఎందుకో మీకు చెబుతే పూర్తిగా తగ్గిపోతుందని అనిపిస్తోంది. వినండి మరి...

 

జన్మనామలు ఎవరు కనిపెట్టారో కాని, చాల వింతగాను, ఇబ్బంది పెట్టేవిధంగాను వుంటాయి. మీ జన్మనామం మీకు తెలుసో లేదో గాని, నాది మటుకు నేనే కాదు ఎవరూ మరచిపోనంత విచిత్రంగా ఉంటుంది - 'పీతాంబరం'. ఏవండీ, మగపిల్లవాన్ని కదా, స్వేతాంబరం అనో లేదా కేదాంబరమనో పెట్టొచ్చుగ - అహా... ఆచారం అడ్డోస్తుందని అదే ఖాయం చెసారు. ఒక విధంగా ఆలోచిస్తే అది సాక్షాత్తు దేవుళ్ళు ధరించే వస్త్రం. కానిమనకు తెలిసి ఆడవాళ్ళు కట్టుకునే పట్టుచీరని కూడా పీతాంబరం అనే అంటారు. అక్కదొచ్చిందండి సమస్య.

ఇహ నా అసలు పేరు విషయానికొస్తే, తాతలకు, నాన్నమ్మలకు వాళ్ళ పిల్లలమీదకన్నా వాళ్ళ మనుమలు మనుమరండ్ల మీద ఎక్కువ ఉంటుందనే విషయాన్నీ, పిల్లలు పుట్టకముందే వాళ్ళ పేర్లు నిర్ణయించి వాళ్ళ అధికారానికి (నిజం చెప్పాలంటే వాళ్ళ నియంత్రుత్వానికి) శ్రీకారం చుడతారు. నా విషయంలో అదే జరిగింది. నా పేరు పెట్టినప్పుడు మా అమ్మ, నాన్న సీన్లో లేరనేది అర్ధమవుతుంది. మా తాతగారు నాపేరేమో 'శ్రీ విరించి' అని మా అన్నయ్య పేరేమో శ్రీమాన్ మరి మా తమ్ముడికేమో శ్రీధర్ [not-so-embarrassing] పేర్లు పెట్టి ఎంతో పుణ్యం కట్టుకున్నరనే చెప్పొచ్చు.

 

ఇప్పటివారకు ఏ conflict లేకుండా అంతా సవ్యంగానే ఉందిగా, ఈ సోది మనకెందుకు చెబుతున్నాడు అని అనుకొంటున్నారా? వస్తున్నా, వస్తున్నా. అక్కడికే వస్తున్నా!

 

నాకు నాలుగేల్లున్నప్పుడు శ్రీ విరించి అంటే శ్రీ మహా విష్నువు అని మా నాన్నమ్మ చెప్పేది. అంత చిన్న పిల్లవాడికి శ్రీ విష్నువు గురించి, విరించి గురించి ఎందుకండీ పెద్దవాళ్ళ పిచ్చి కాకాపోతే. అర్థంకాకున్నా అర్ధమైనట్లుగా బుద్ధిగా తలూపడం అ ageలో మనకొచ్చిన ఒకే Time-Saving Trick. ఈ కథలో అది trick చాలా సార్లు వాడతాను. మీరే చూద్దురుగాని. నాకు ఎడేల్లోచ్చాయి. Place: స్కూలు. Scene: క్లాసురూం. టీచర్ attendance తీసుకున్నాడేకానీ నా పేరు పిలవలేదు. లేచి నించొని 'సర్' అనేలోగానే "ఈరోజునుండి నీపేరు విజు కాకతీయ అయింది . నేను కాదు మీ నాన్నగారు మార్చరు. ఇదో ఇప్పుడే మెసేజ్ ఒచ్చిందాని" ఓ పేపర్ చూపించారు. lunch breakలో అదే schoolలో చదువుతున్న మా అన్నయ్య దగ్గరకెళ్ళి ఈ విషయం చేబుతామనేసరికి అచ్చం అలాంటి వార్తే అతనూ చెప్పాడు. "నాన్న నాపేరు మార్చాడ"ని. దాంతో ఇంటికెళ్ళి తాతగారు పెట్టినపేరు మార్చే అధికారం తండ్రికి ఎవరిచ్చారా అనే అంశంపై మా అమ్మ, అన్నయ్య రీసెర్చ్ మొదలుపెట్టారు . కొన్నాళ్ళు అలా వాళ్ళు పేరు మార్పిడి మీద కుస్తీ పట్టి అలసిపోయర్లెండి. కాని మా అన్నయమటుకు ఇప్పడికి వారానికొకసారైన కడుపునిండా argue చేస్తూనేవున్నాడు.

 

మీకు అనుమానం రాకముందే ఒక విషయం చెప్పాలి. మనుషులకు stamp collection, coin collection లాంటి హాబీస్ ఉంటాయిగాని, అదేంటో మా నాన్నకు name collection ఓ హాబీ. రకరకాల పుస్తకాలు చదివినప్పుడల్లా దాంట్లోని కొన్ని unique పేర్లు collect చేసేవాడు. ఆ ప్రీమియం collectionలోనుండి పెట్టినవే మా పేర్లు. ఎవరి పిచ్చి వాళ్ళ ఆనందమని సర్డుకుపోఎసరికి హై స్చూలుకు వచ్చేసాను. స్కూల్ మారడంతో classmates ను పరిచయం చేసుకుంటూ నా పేరు పళానా అని చెప్పగానే విజు మీ నిక్ నేమా, అసలు పేరు 'విజయ్' నా. అవునూ, ఈ కాకతీయ ఏంటి? సామరాజ్యం పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు లాంటి ప్రశ్నలు రకరకాలుగా అడగడం. నేనూ అ టైములో తోచిన సమాధానం చెప్పడం అలవాటైపోయింది.

 

నేను intermediateకొచ్చేసరికి నా ఖర్మకాలి కాకతీయ యూనివర్సిటీ start అయింది. నా సమస్య డబులయింది. ఇహ డిగ్రీ కాలేజీలోకొచ్చాకా నాపేరు చెప్పడం పూర్తిగాకముందే 'ఓ మీరు కాకతీయ యునివర్సిటిలో చదువుతున్నారా' అని అనేవాళ్ళు. నా పేరు కథ చెబుతే మళ్ళీ ఓ అరఘంట సుత్తి ఎందుకులే అని "అవును" అని అబద్ధం చెప్పేవాన్ని. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నానన్నది campusలో ఉన్నప్పుడే నిజం. బయట అది అబద్ధం.

 

ఇలా నా పేరు సమస్య ఎన్నో మలుపులు తిరిగింది. నేను OU కాంపస్ లో masters చేస్తున్నప్పుడు నా పేరు వినగానే నాతో football ఆడుకొందాం అనుకొన్నాడు ఒకడు. వాడికి 'కోడి మెదడు' అని నిక్ నేం కూడా ఉంది. ఏళ్లుగా వింత వింత సమస్యలతో విసిగిఉన్న నాకు ఓ మెరుపులాంటి ఆలోచన తట్టింది. మాది వరంగాలూ, మాది కాకతీయ సామరాజ్యంలో ఆఖరు కుటుంబం కావడంతో మా నాన్న గారు ఆ పేరు ఖాయం చేసారు అని చెబితే మీరు నమ్మరుగాని వాడి నమ్మాడండి. కొన్నాళ్ళు నన్ను అలాగే పరిచయం చేసాడు కూడా!

 

అలాగా వాడు నమ్మాకే కాకతీయ సామరాజ్యం మీద రీసర్చ్ మొదలు పెట్టాను. అదే curiosityతో హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, గతంలో ఎన్నోసార్లు చూసినా ఈసారి వెళ్ళి దాని చరిత్ర మొత్తం తెలుసుకొని ఓ 5 నిముషాలు tranceలోకి వెళ్లి అదేదో మా తాత ముత్తాతలు కట్టిచించిన గుడిలా ఫీలయ్యాను కూడా!

 

పేరుతొ బాగా విసిగిపోయీ రకరకాల వివరణలు ఇచ్చి పండిపోయి, కొత్త job లో చేరినప్పుడు, ఏదైనా పార్టిల్లో కొత్తవాళ్ళను పరిచయం చేసుకున్నప్పుడు విసుగులేకుండా కొత్త ప్రయత్నాలతో టైం పాస్ చేసేవాన్ని.

 

ఎవడైనా విసా వస్తే కాలరు ఎగరేసి నేనూ అమెరికాకు వెళ్తున్నాని ప్రతివాడికి చెప్పి సంతోషపడతాడు కదండీ. కాని నేను ఇండియా శాకులకు కోలుకోన్ననేగాని US లో ఏ భయకరమైన సంఘటనలు ఎదురుకోవస్తుందేమో అని టెన్షన్ మటుకు ఉండిందండి. ఇంతలో ఫ్లైట్లో కూచున్నప్పుడు ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఫ్లైట్ దిగ్గానే 'కాకతీయ' ను కట్ చేసా. కొన్నేళ్ళు First అండ్ Last Nameతో ఏదో దొంగలా చెలామణి అవుతున్ననే అనే బాధ పడాలో, పోన్లే ప్రతి వాడికి ఇక్కడకూడా పేరుతొ పోరు తప్పింది అనే సంతోషపడాలో తికమక పడుతూనే వున్నను. ఇంతలో తెలుగు సినిమా మిడిల్ క్లాసు ఫ్యామిలి లాగే ఇంకో కొత్త సమస్య. నా first name విజు ఖూని చేసి వైజు అనో వైగు అనో పిలవడం మొదలుపెట్టారు అమెరికన్లు.

 

ఇక నావాళ్ళ కాదండి. నేనే కాదు మీరు విసిగిపోయినట్టున్నారు. ఇద్దరం ఒక understandingukochi ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. ఫస్ట్ నేములో ఫస్ట్ లెటర్ V ఉంటే చాలండి. ఎవ్వరు ఏ పేరు పెట్టి పిలిచినా పలికుతానండి. ఉంటానండి !


ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుతుంటాను...

నలుగురిని చూస్తే చాలు పాడాలని కోరిక

అడగాలని గుర్తేరాదు వాళ్ళకు అసలు ఉందొ లేదో తీరిక

 

గొంతు సరిచేసుకొని పడేస్తాను చకచక

నాకు నేనే మురిసిపోతా ను బాగా పాడానని ఎంచక్కా...

పాత మేలోడీస్ అంటే ప్రాణమని చెప్పనా మీకిందాక ?

విన్నవాళ్ళ మోఖలను చూడాలండి నే పాట పాడాక

అసలు నేను పాడాన చదివాన అని పడుతుంటారు తికమక

ఇప్పడికే మీకు సీనూ అర్ధమై ఉంటుందిగా చెప్పదానికేముందిక

 

నలుగురిని చూస్తే చాలు పాడాలని కోరిక

అడగాలని గుర్తేరాదు వాళ్ళకు అసలు ఉందొ లేదో తీరిక

 

పల్లవి సరిగా వుంటే చరణం సరిగా ఉండదు

చరణం సరిగా పడితే రాగం సరిగా పలకదు

ఇవన్నీ సరిగా వుంటే టైమింగ్ అసలు కుదరదు

నా Frequently Victimized List లో వున్నారిద్దరూ క్లాస్ గాయాకులు

అయిదు పదాల చరణానికి ఇస్తారు 100 టిప్పులు

వాళ్ళ ముందర పాడినప్పుడల్లా కనిపుస్తుటాయి చుక్కలు

 

నలుగురిని చూస్తే చాలు పాడాలని కోరిక

అడగాలని గుర్తేరాదు వాళ్ళకు అసలు ఉందొ లేదో తీరిక

 

వారల తడబడి ప్రాక్టీసు చేసి వినిపిస్తాను నా పాట మా అవడకి

అడుగుతాను 1-10 స్కేలులో ఎంతిస్తావని

ఇన్నేళ్ళ చరిత్రలో మూడు పాయింట్ల కన్నా ఎక్కువోస్తే వోట్టండి

పాటలేకాదండి రాస్తుంటాను కథలు కవితలు

చేస్తుంటాను వింత వింత ప్రయోగాలు ​

అచ్చు వేయడానికి భయపడతాయి ప్రపంచంలోని అన్ని పత్రికలూ ​

 

నలుగురిని చూస్తే చాలు పాడాలని కోరిక

అడగాలని గుర్తేరాదు వాళ్ళకు అసలు ఉందొ లేదో తీరిక

 

ఈ మధ్యే పేజీకి $5 చొప్పున ఇచ్చాను ఓ ఫ్రెండుకు నా కథ వినడానికి

ఎంతో ఆక్షన్ చేస్తూ విన్న, ఏమి లేదు అయన దగ్గర చెప్పడానికి

'wonderful అనేసాడు. ఏదోకటి చెప్పాలిగా సిట్టింగ్ fees పుచ్చుకోడానికి

 

నలుగురిని చూస్తే చాలు పాడాలని కోరిక

అడగాలని గుర్తేరాదు వాళ్ళకు అసలు ఉందొ లేదో తీరిక

Dr. ఆచార్య ఫణీంద్ర గారు

​​Dr. ఆచార్య ఫణీంద్ర గారు అట్లాంటాలో ఘనంగా జరిగిన 2వ NATA మహాసభలో పాల్గొనడాని వచ్చిన సందర్భంగా మైత్రి సంస్థ (www.ourMiatir.org) వారు 12 జూలై 2014న నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో తీసిన చిత్రం.



మనిషి బ్రతుకింతే

మా బాసుకు ఆఫీసులో కొంచెం పనేక్కువైందని అనిపించేసరికి "అబ్బబ్బా వేకేషను తీసుకోక చాలారోజులిందని" గబగబా అదోక క్రూజ్ కు నాలుగు టికెట్లు బుక్ చేస్తాడు. ఈ చిన్ని వేకేషనుకు కూడా సర్దుకోవలసిన వస్తువులు వందైయితే, తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంకో వంద. Email వేకేషను మెసేజు, కుడిపక్క నేబరుకు న్యూస్ పేపరు తీసిపెట్టండి అని చెప్పడం, ఎడమపక్క నేబరుకు మొక్కలకు నీళ్ళు పెట్టమని బ్రతిమిలాడడం చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో! తిరిగొచ్చాక మొక్కల మీద అన్ని కూరగాయలు లెక్క తప్పకుండా ఉన్నాయో లేవో చూసుకోవడంలాంటివి నా నోటితో చెబితే అస్సలు బాగుండదు.

 

నాలుగు రోజుల ఈ క్రూజుకు ఎనమిది సూటుకేసులు పదహారు రోజులపాటు సర్ది, మా మేడమ్ని, ఇద్దరు పిల్లల్ని వ్యానులోకి తోసేసి, 90 మైళ్ళ స్పీడులో బయలుతెరుతాడు మా సారు. మరి ఆరు గంటల్లో Jacksonville చేరి, కారు పార్క్ చేసి, లగేజితో షిప్పులో లేగ్గేట్టకపోతే $1600 బొక్కేగామరి?

అవునూ, నన్ను పరిచయం చేసుకోకుండానే వగేస్తున్ననేమిటి? నా పేరు Roxy. నేనో కుక్కను. అదేదో మీ మనుషులు తిట్టుకుంటారే 'వాడో కుక్కని', 'కుక్కలాగా వాగుతున్నాడని', అలాంటి కుక్కను కాదండోయ్. అలాగని 'I am a 100% faithful dog' అని చేప్పుకోడం ఇష్టంలేదు నాకు. ఎనీవే, 'నైస్ తో మీట్ అల్ ఆఫ్ యు'.

 

మనవాళ్ళ క్రూజు షిప్పు కదిలిందని అనుకోని మనమూ సీను 2లోకి ఎంటరావుదామా?

నాగురించి ఇంకాస్త... ప్రతిసారి మావాళ్ళు ఏ Trippu వేసినా నన్ను మాత్రం క్లాసు వన్ డాగ్ బొర్దింగులొనే పెట్టి వెల్తారు. Barking Hound నా ఫేవరేట్ ప్లేసని ఎలా కనిపెట్టారోగాని, 20 మైళ్ళు డ్రైవ్ చేసి నాకిష్టమైన జాగువార్ కార్లోనే తీసుకెళ్తారు. వెల్లినంతసేపు కారు వెనుక సీట్లో నించొని, విండోలోంచి తొంగిచూస్తూ హాయిగా వెళ్తుంటే నా రాజభోగాన్ని చూసి జననాలు తట్టుకోలేరంటే నమ్మండి. నా బోర్డింగు ఫీజెంతో తెలుసా? చెవ్విటుపడెయ్యండి... $159 పర్ డే! అదేవిటో నేనంటే మావాళ్ళకు పిచ్చి ప్రేమ. 

 

ఈ బొర్డింగు లంచ్ బఫెలో ఆరు అపెటైసర్లు, 12 entreeలు, నాలుగు డిసర్ట్లు ఉంటాయి. వింటూంటే మీకు నోరూర్తుందికదండీ. గమనించానులెండి. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు వీల్లిచ్చే Spot-On Treatment, Deodorizing, Itchy-skin Shampooing లాంటి luxury services మీరెళ్ళే SPAల్లో ఎక్కడ దొరుకుతాయండి? ఒకవేళ ఉన్నా సెల్ఫ్- సర్వీసేగా. నాకైతే 24 ఘంటలు ఇద్దరు attendentలు. 

 

ఇహ సోషలైజింగ్ విషయానికొస్తే ఇక్కడున్నన్ని రోజులు రకరకాల రిచ్ బ్రీడ్ కుక్కల్ని పరిచయం చేసుకొని కనెక్షన్సు పెంచుకుంటూ, ఇదివరకపుడో కలిసిన కక్కల్తో 'హాయ్ లాంగ్ టైం నో సీ' అనుకుంటూ కాలం గడిపేస్తాం. నాలుగు ఘంటలకు స్నాక్ టైములో మీ మనుషులు రోజు పడే వింత వింత బాధల మీద జోకులేసుకుంటూ మరో ఘంట గడిచిపోతుంది. ఆరు కాగానే లైటుగా వాక్ చేసోచ్చి, షవరుతీసుకొని తొందరగా డిన్నర్ ముగించెస్తాను. 8 pm నుండి 10 pm వరకు నా రూములో 'టాప్ డాగ్' ఛానెల్ చూడందే నాకు నిద్ర పట్టాదు మరీ. ఇంటికెళ్తే కాలుమీద కాలేసుకొని 60" HDTV లో ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్సు చూసే అవకాశం ఎందుకుంటుంది. అస్తమానం ఆ 'MAA TV, టీవీ9, ZeeTV చానెళ్ళలో చెత్త సీరియల్లు న్యూసు చూసి చూసి తల వాసిపోయింది. ఒకసారి డాక్టరు దగ్గరకు నన్ను తలనొప్పని  తీసుకెళ్తే దూరంనుండే చూసి చెప్పాడు డాక్టరు మాస్టారు... 'ఓ వారం పాటు తెలుగు ఛానళ్ళు కట్టేసి CNN, FOX లాంటి ఛానళ్ళు చూపిచండి వీడికి, ఏ మందఖర్లేదు".

 

అనునూ నాకు తెలియకడుతాను, మీ మనుషులు కొత్త వాళ్ళను పరిచయం చేసుకొని మాట్లాడిన 10 నిమిషాల్లో ఈమయిలు IDs, ఫోన్ నంబర్లు లాంటివి మార్చుకోడానికి సగం టైం అయిపోతుంది. మిగతా 5 నిమిషాల్లో next US presidential candidates గురించో లేదా తమిళనాడులో జయలలిత ఐపాడ్లు, చీరలు పంచిపెట్టి ఎలా చీఫ్ మినిస్టర్ అయిందో అన్న విషయాలే ఎక్కువ మాత్లాడుతారు. మా ఇంట్లో జరిగే ప్రతి పార్టీలో ఓ మూల కూచిని రీసర్చి చేసి నేను గమనించిన విషయం అవిటంటే మనుషుల పనికిరాని సోల్లు కబుర్లు తప్ప వాళ్ళ పిల్లల గురించి, పిల్లుల గురించి మాత్లాడుకొరు. అదే అ అమెరికన్ పార్టీకి వెళ్ళినా మూడే టాపిక్లు 'కుక్కకు, ఫుట్బాల్ లేదా వెదర్'.

 

సీన్ 3 - నో కమర్షియల్ బ్రేక్

నేను మాట్లడుతున్నంతసేపు నాకు తెలుగు ఇంగ్లీషు భాషలు ఇంత fluentగా ఎలా వచ్చాబ్బ అనే question మార్క్ మీ ఫేసులో ఇట్టే కనిపిస్తోంది. I am an American Dog born an raised in US. నన్ను పెంచుకుంటున్న వాలు దేశీలు. అందులో తెలుగువాళ్ళు. వీళ్ళు వాళ్ళ మాతృభాషను చాల రకాలుగా వింత, వింత accentలో మాట్లాడుతారని క్లోసుగా observe చేసి తెలుసుకునేసరికి ఓ సంవత్సరం పంటింది. "నేను చెప్పింది నీకు సమజైతలేదు" అని మా సారూ ఓ పక్క. "ఒక్కకసారి మీరేం మాట్లాడుతారో నా అర్ధమై చావదు. నా బుర్ర తినేస్తునారండి" అని మా మేడం (వాళ్ళది లవ్ మ్యారేజ్ లెండి. అదో పెద్ద స్టోరి - తరువాత చెబుతాను). ఇలా బోరుకొట్టినప్పుడు లైటుగా ఫైటుచేసుకుంటుంటే, upstairs రూంలో నుండి పిల్లకాయలు బయటికొచ్చి, "Stop it. we don't understand what you guys are fighting about. Calm down. We've things to do' అని అన్నప్పుడు నాకనిపిస్తుంటుంది 'కుక్క బ్రతుకు ఎంత హయండి. ఒకే భాష. రెండే అక్షరాలూ. పెద్ద 'భౌ', చిన్న 'భౌ'. 

 

4వ సీను. భయపడకండి, చివరది కూడా!

ఎంతసేపు మనుషుల లైఫ్ స్టైల్ మీద నేను నెగటివ్ కామెంట్స్ చేస్తున్నానని మీరనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ప్రతి రోజు లేని పోనీ కొత్త టెన్సన్స్ ఎందుకు మరీ కొని తెచ్చిపెట్టుకున్తారనేదే నా బాధ.

 

మీకో ఒక్క కంప్యూటర్ సరిపోదా? డెస్క్ టాప్, లాప్ టాప్, ఐపాడ్... ఇన్ని రకాల కంపూటర్లు ఎందుకండీ. అదే కాకుండా మూడు టీవీలు, నాలుగు కార్లు అయిదు ఫోన్లు ఆరు క్రెడిట్ కార్డులు... ఎంటండి ఇదన్తా. మరి ఇవన్ని మేనేజ్ చేయడానికి 24 ఘంటలు ఎలా సరిపోతాయి?

అదలా వుంచి, "వర్క్ లో జాన్ గాన్ని మూన్నేల్లకే ప్రాజెక్ట్ మనజర్ని చెసారు. నేను PMP పాసయ్యి రెండేళ్లనుంచి మొత్తుకుంటున్నా నా మాట మానేజ్మెంట్ పట్టించుకోవట్లేదు అనే బాధ ఒక వైపు. 11th స్టాండర్డ్ లో ఉన్న కూతురుకి SAT examలో 2400లకి 2400 మార్కులోచ్చినా ఇంకా ఎదో లోటు. అసలు వీళ్ళు మాక్సిమం స్కోరు 2500 చేస్తే మా అమ్మాయి 2500 మార్కులు చేచుకుంటుందిగా అనే బాధ ఇండో వైపు.

 

నన్ను మా ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేసి మా వాళ్ళు ప్రతి వీకెండు పార్టికని బయలుదేరిన ప్రతిసారి ఈ సీను నాకు మామూలే :

 

"అసలు మనం గరాజ్ క్లోజ్ చేసినమా" అని మా సారు. 

"నా మతి మండ నేను సెక్యూరిటీ అలారం ఆన్ చేయనట్టున్నాను" అని మా మేడం" అంతే, 'కారు u-టర్న్ చేసి, గరాజ్ ఓపెన్ చేసి, అలారం ఆఫ్ చేసి, మల్లి అలారం ఆన్ చేసి, గరాజ్ క్లోజ్ చేయడం' అనే సీను నాకు, జూనియర్స్ కి చాల కామన్ సీన్. ఈ విషయం మీద మేం జోకులేసుకుంటాం కూడా.

 

పిల్లల sleepoverలు, కూపన్ expirationలు, Lufthansa వాడు ఇంటర్నేషనల్ Trippuku రెండు సూటుకేసులకు బదులు ఒకటే allow చేస్తున్నాడనే షాకింగ్ న్యూస్, ఈజీ password అయితే ఎవడైనా hack చేస్తాడేమోనన్న అనుమానం, complicated password అయితే మరచిపోతామేమోనన్న భయం... పాపం ఎన్ని కష్టాలండీ మనషికి. 


అందుకేనేమో 'Future Shock' అనే పుస్తకంలో Alvin Toffler రాసిన విధంగానే కొత్త కొత్త జబ్బులు పుట్టుకొచ్చాయి. అదేంటి ఉదాహరణకి Attention Deficit Disorder (ADD) తీసుకోండి. జబ్బు చిన్నదే సుమా... కాని వేరేవాళ్ళను చచ్చేంత ఇబ్బంది పెడుతుంది. కాని ఒక మంచి జరుగుతుంది. డాక్టర్లు బాగుపడుతున్నారుగా?

 

మోరల్ అఫ్ ది స్టొరీ: టెన్షన్ తగ్గించండి. Attention పెంచుకోండి. 

ఏది అమైయిన మనిషి బ్రతుకింతే!

HINDI SHAYARI

Please excuse the typos. I am not very good at typing in Hindi. I did my best. 1 एक दो सान्स रोख कर रख्ने का अभ्यस कर लो य़दि प्यर मे डूब ...